తుపాకీ రాముడు, పిట్టల దొర అంటూ ట్రంప్ పై సెటైర్లు

తెలుగులో తుమాకీ రాముడు, పిట్టల దొర అంటే వెంటనే గుర్తొచ్చేది... కబుర్లతో గారడీ చేసే కామెడీ కారెక్టర్లే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ కోవలోకే చేరిపోయినట్టు కనిపిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో  భేటీకి సిద్దమైన ట్రంప్ కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా పలు సంక్షోభాలను పరిష్కరించడంలో తానే కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తన భుజాలను తానే చరిచేసుకుంటున్నారు.  భారత్ - పాక్ మధ్య ఘర్షణలకు సంబంధించి మాట్లాడిన ఆయన ఆ రెండు దేశాలు అణు యుద్ధం వరకు వెళ్లాయన్నారు. ఆ సమయంలో 6. 7 యుద్ద విమానాలు కుప్పకూలాయన్న ట్రంప్.. ఆ రెండు దేశాల ఘర్షణను తానే పరిష్కరించానంటూ గప్పాలు కొట్టుకున్నారు. అంతే కాదు ఆరునెలల్లో ఏకంగా   ఆరు యుద్దాలను ఆపానని వైట్ హౌస్‌లో వెల్లడించారు.

 ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ తమ నిర్ణయంలో ఎటువంటి విదేశీ జోక్యం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. దీనిపై ప్రధాని మోడీ లోక్‌సభలో మాట్లాడుతూ పాకిస్థాన్‌పై దాడులు ఆపాలని తమకు ఏ దేశం చెప్పలేదని స్పషం చేశారు. అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసుకున్న తర్వాతే ఆపరేషన్‌కు విరామం ఇచ్చారని ప్రకటించారు. అయినా ట్రంప్ తానే అన్నీ ఆపానని ప్రకటనల మీద ప్రకటనలు చేసుకోవడంపై నెటిజన్ల  రకరకాలుగా ట్రోల్ అవుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu