ట్రంప్, పుతిన్ భేటీ.. తుస్సు!

యూరప్‌ మొత్తాన్నిసంక్షోభంలో ముంచెత్తుతూ గత మూడేళ్లుగా సాగుతున్న యుక్రెయిన్ యుద్ధానికి ముంగిపు పలికే దిశగా ఒక కీలక ముందడుగుగా అంతా భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ ఎలాంటి ముగింపూ లేకుండానే ముగిసింది.  అలస్కా వేదికగా జరిగిన ఈ భేటీ   ప్రపంచవ్యాప్తంగా అసక్తి రేపింది. అయితే మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది.  అయితే భేటీ అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్, పుతిన్ లు భేటీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రియిన్ యుద్ధం ముగింపు దిశగా చర్చలు  సాగాయని అన్నారు. అయితే  ఆ దిశగా ఎటువంటి ఒప్పందం కుదరలేదని చెప్పిన ఇరువురూ.. ఒప్పందం కుదిరే వరకూ ఏ విషయాన్నీ కచ్చితంగా చెప్పలేమన్నారు.

అయితే చర్చలు మాత్రం చాలా నిర్మాణాత్మకంగా  సాగాయని పేర్కొన్నారు. ఇక ట్రంప్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకాలని రష్యా మనస్ఫూర్తిగా కోరుకుంటోందని చెప్పారు.  ఇక రష్యాతో వ్యాపారం గురించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో వ్యాపారం సాగాలంటే.. ముందుగా రష్యా తమ  కండీషన్లకు అంగీకరించాలన్నారు. మొత్తం మీద ఎంతో ఆసక్తి రేకెత్తించిన పుతిన్, ట్రంప్ భేటీ  ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిందని చెప్పాలి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu