తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడంటే?
posted on Apr 19, 2025 3:41PM
.webp)
తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఏపీ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. 22వ తేదీ ఉదయం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఇంటర్ ఫలితాలు బోర్డు అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి. ఇంటర్ పరీక్షల్లో 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను విడుదల చేసిన తర్వాత నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు.