Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
posted on: Apr 19, 2025 3:13PM
తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నాగర్ కర్నూల్‌లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్ హెలికాప్టర్‌లో వెళ్లారు.కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్నిప్రమాదం సంభవించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో చిన్న నిప్పు రాజుకుని, హెలికాప్టర్ గాలికి చెలరేగిన మంటలు. దీంతో మంత్రి పొంగులేటికి, కాంగ్రెస్ నేతలకు పెను ప్రమాదం తప్పింది. లేకపోతే పెనుప్రమాదం సంభవించి ఉండేది. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.



.webp)


