త్వరలో కొత్త 200 నోట్లు...
posted on Jun 29, 2017 10:42AM

పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు లావాదేవీలు చాలా ఇబ్బందిగా తయారయ్యాయి. ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు రెండు వేలు, కొత్త ఐదువందల రూపాయల నోట్లు అందుబాటులోకి తెచ్చినా పరిస్థితి మాత్రం మామూలుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ మరో కొత్త నోటు మార్కెట్ లోకి తీసుకురావడానికి రంగం సిద్దం చేస్తుంది. అదే రూ.200 నోటు. త్వరలో రూ.200 విలువైన నోట్లను అందుబాటులో తీసుకువచ్చేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రంగం సిద్ధం చేస్తోంది. అంతేకాదు మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఉన్న ప్రభుత్వ ముద్రణశాలకు కొన్ని వారాల క్రితమే ఈ నోట్ల ముద్రణ పనిని అప్పగించినట్టు తెలుస్తోంది. నకిలీవి సృష్టించడానికి వీల్లేని రీతిలో రూ.200 నోట్లలో అదనపు భద్రత ప్రమాణాలు చేర్చారు. ప్రస్తుతం వీటిని వివిధ కోణాల్లో తనిఖీ చేస్తున్నారు. రూ.100- రూ.500 మధ్య ఇలాంటి నోటు రావడం వల్ల రోజువారీ నగదు పనులు సులభమవుతాయని బ్యాంకుల అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.