జింబాబ్వేపై గెలిచిన ఇండియా
posted on Mar 14, 2015 2:09PM

ప్రపంచ కప్ క్రికెట్ గ్రూప్ బీలో లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. అయితే సులువుగా విజయం సాధిస్తుందని భావించిన భారత జట్టు చెమటోడ్చి విజయం సాధించాల్సి వచ్చింది. టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 48.5 ఓవర్లలో 287 పరుగులు చేసింది. 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన భారత జట్టు 90 పరుగులకే నాలుగు వికెట్లను చేజార్చుకుని ఓడిపోతుందా అనే సందేహాలను కలిగించింది. అయితే ఆ తర్వాత రైనా, ధోనీ నిలకడగా ఆడి పరుగులను పెంచారు. రైనా 109 పరుగులు, ధోనీ 85 పరుగులు సాధించి భారత జట్టు విజయానికి దోహదం చేశారు. 48.4 ఓవర్లలో భారత్ విజయ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని జట్టును భారత్ ఆలౌట్ చేసింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన ఘనతను భారత్ సాధించింది. గతంలో ఈ రికార్డును దక్షిణాఫ్రికా జట్టు సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లన్నిట్లో ఇండియా గెలిచినట్టు అయింది.