'అసభ్యుడిని' అంతం చేశారు
posted on Mar 14, 2015 12:59PM

ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఓ యువకుడిని ఆ యువతి తరుపు మనుషులు కొట్టి చంపేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీతూ అనే యువకుడు చెప్పుల కంపెనీలో పని చేస్తున్నాడు. మద్యం తాగి ఉన్న అతను అదే ప్రాంతానికి చెందిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆ యువతి ఇంట్లో చెప్పగా వాళ్లు కోపంతో వెళ్లి అతనిని ఇంట్లోంచి బయటకి లాగి, చితక్కొట్టారు. ఈ ఘటనలో జీతూకూ బాగా దెబ్బలు తగలడంతో అతనిని ఆస్పత్రికి తరలించగా అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతి కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని జీతూ కుటుంబసభ్యులు అతని మృతదేహంతో సహా రోడ్డెక్కి డిమాండ్ చేశారు. అయితే అదే ప్రాంతంలో ఉన్న కొంతమంది అమ్మాయిలు, మహిళల పట్ల జీతు కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలున్నాయని పోలీసులు తెలిపారు.