భారత్ రెండో సర్జికల్ స్ట్రయిక్స్...

 

భారత్ సరిహద్దు ప్రాంతంలో తరచూ కాల్పులు జరుపుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు భారత జవాన్లు గట్టిగానే సమాధానం చెప్పారు. క్రిష్ణఘాటి సెక్టార్ లో పాకిస్థాన్ దాడులకు పాల్పడింది అయితే ఈ దాడులను గట్టిగా ఎదుర్కొన్న భారత సైనికులు పాకిస్థాన్ బంకర్లే లక్ష్యంగా శక్తిమంతమైన బాంబులను ప్రయోగిస్తూ విరుచుకుపడ్డారు. రాకెట్ లాంచర్లను ప్రయోగించి పాక్ బంకర్లను సమూలంగా నాశనం చేశారు. ఈ దాడిలో  ఏడుగురు పాక్ సైనికులు మరణించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ దాడికి సంబంధించి వీడియో కూడా తీసి దానిని మీడియాకు అందించినట్టు సమాచారం. దూసుకెళుతున్న చిన్న రాకెట్లు, పేలిపోయి కుప్పకూలుతున్న బంకర్లు, తుపాకుల శబ్దాలు ఈ వీడియోలో ఉన్నాయి. కాగా ఈ దాడిని భారత సైనికాధికారులు రెండో సర్జికల్ స్ట్రయిక్స్ గా అభివర్ణిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu