ఎర్రబుగ్గల బదులు ఏ కలరైనా పెట్టుకోవచ్చు

దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న వీఐపీ సంస్కృతికి చెక్ పెట్టే ఉద్దేశ్యంతో ఎర్రబుగ్గలను నిషేధించింది కేంద్రప్రభుత్వం. అయితే శాంతి, భద్రతలను పరీరక్షించే పోలీసులు, రక్షణ, పారామిలటరీ బలగాల వాహనాలకు ఎర్రబుగ్గలకు బదులుగా మిగిలిన రంగుల బుగ్గలను ఉపయోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎవరెవరు ఈ రంగు రంగుల బుగ్గలను వాడుకోవచ్చో కేంద్ర రవాణా శాఖ అధికారులు పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. దీనికి సంబంధించి రవాణాశాఖ ఓ స్టిక్కర్‌ను విడుదల చేసి వాటిని వినియోగిస్తున్న అధికారి హోదా, వాహనం నెంబర్‌ను స్టిక్కర్‌లో ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu