కొవిడ్ పై గుడ్ న్యూస్.. థర్డ్ వేవ్ అంత డేంజర్ కాదట..
posted on Jun 26, 2021 10:18AM
థర్డ్ వేవ్ ... ఇప్పుడు అందరిని భయపెడుతున్న ఒకే ఒక్క మాట ఇదే. అయితే, కరోనా థర్డ్ వేవ్’ రాదని, వచ్చినా, అంత భయంకంగా ఉండదని, ఓ చల్లని కబురు చెపుతున్నారు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ. అలాగని ఇదేమీ ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదు. డాక్టర్ భార్గవ మరొకొందరు ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు, లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ కు చెందిన నిమ్లాన్ అరినామిన్పతితో కలిసి సంయుక్తంగా చేసిన అధ్యయనం ఆధారంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజేఎంఆర్)లో ప్రచురించిన గణిత 'మోడలింగ్' విశ్లేషణ ఆధారంగా, వ్యాక్సినేషన్ పరిధిని విస్తరించడం వల్ల కరోనా వైరస్ థర్డ్ వేవ్ తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. సెకెండ్ వేవ్ కొనసాగుతున్న మూడు నెలల కాల వ్యవధిలోనే జనాభాలో 40 శాతం మంది రెండు మోతాదుల టీకాను తీసుకున్న విషయాన్ని అధ్యయనం గుర్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియతో థర్డ్ వేవ్’కు అడ్డుకట్ట వేయవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.వ్యాక్సినేషన్ పరిధిని విస్తరించడం వల్ల కరోనా థర్డ్ వేవ్ తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని అంటున్నారు.
సెకెండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలోనే జనాభాలో 40 శాతం మంది రెండు మోతాదుల టీకా తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగితే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం లేదని చెబుతున్నారు నిపుణులు. ఈ అధ్యయనం కోసం SARS-CoV-2 ట్రాన్స్మిషన్ యొక్క కంపార్ట్మెంటల్ మోడల్ ఉపయోగించి.. మూడో వేవ్ కు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ముమ్మర వ్యాక్సినేషన్ కారణంగా కరోనా వ్యాప్తి తీవ్రతను 60 శాతం వరకూ తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంటోంది.
అయితే, థర్డ్ వేవ్ రాదన్న భరోసా పనికి రాదని, భార్గవ బృందం హెచ్చరిస్తోంది. అలాగే, కొత్త వేరియంట్‌కు అధిక సంక్రమణ శక్తి ఉండి, అది రోగ నిరోధక శక్తిని తప్పించుకోగలిగితే మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసినా రావొచ్చని చెప్పారు. అయితే.. ఇది రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని వివరించారు.ముమ్మర వ్యాక్సినేషన్ కారణంగా కరోనా వ్యాప్తి తీవ్రతను 60 శాతం వరకూ తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంటోంది. థర్డ్ వేవ్‌కు సంబంధించిన నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రజలలో కరనాను ఎదుర్కొనే రోగనిరోధక సామర్థ్యం కాలక్రమేణా తగ్గవచ్చు. పలితంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదని వారు చెబుతున్నారు.