రాజస్థాన్‌లో కుప్పకూలిన ఫైటర్ జెట్

 

రాజస్థాన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జాగ్వర్ ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ కుప్పకూలింది. చురు జిల్లాలోని రతన్‌గఢ్ ప్రాంతంలో క్రాష్ అయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫైలట్ మృతి చెందాడు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన భనుడా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు.