పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ అంటే ఏంటని ఇండియాలో గల్లీలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అదీ ఐపీఎల్ కు ఉన్న వాల్యూ.  అదీ ఐపీఎల్‌కున్న క్రేజ్‌, ఫేమ్. ప్రతి ఏటా కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరిస్తూ.. అంతకంతకు ఆదరణను పెంచుకుంటోంది ఐపీఎల్. అందుకే దాని వాల్యూ కూడా అలా అలా పెరిగిపోతూ వస్తోంది.  ఏడాది కూడా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఏకంగా 12.9 శాతం పెరిగింది. అంటే 18.5 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది కంటే ఇది 3.9 బిలియన్ డాలర్లు ఎక్కువ. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. ఇప్పుడు ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ అటూ ఇటూగా  1.56 లక్షల కోట్లు. 

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ హౌలిహాన్‌ రిలీజ్ చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. ఐపీఎల్ కోసం బీసీసీఐ మొత్తం నలుగురు స్పాన్సర్లకు అవకాశం ఇచ్చింది. మైఎలెవన్ సర్కిల్, ఏంజెల్ వన్, రూపే, సియట్.. ఈ నాలుగు స్పాన్సర్లు 14 వందల 85 కోట్ల మనీని జనరెట్ చేశాయి. ఇది లాస్ట్ ఇయర్ కంటే పాతిక శాతం ఎక్కువ. అదే సమయంలో ఈ టోర్నమెంట్‌ స్పాన్సర్‌షిప్‌గా ఉన్న టాటా గ్రూప్‌.. 2028 వరకు డీల్‌ను పొడిగించింది. ఈ డిల్ విలువ 2 వేల 500 కోట్లు. ఈ కారణాలు ఐపీఎల్‌ బ్రాండ్‌ను మరింత పెంచాయి.  ఐపీఎల్‌ ఓకే.. ఇక ఫ్రాంచైజీల విషయానికి వస్తే.. ఈ సారి టైటిల్‌ విన్నర్‌గా నిలిచిన రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు టాప్‌ ప్లేస్‌లో నిలిచింది.

17 ఏళ్లపాటు కప్పు గెలవకపోతేనే ఈ టీమ్‌ ఫ్యాన్‌ బేస్, బ్రాండ్‌ వాల్యూ చెక్కు చెదరలేదు. ఈసారి కప్పు గెలవడంతో ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది. గత ఏడాది 227 మిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ.. ఈ సారి ఏకంగా 269 మిలియన్ డాలర్లకు చేరింది. ఇండియన్‌ కరెన్సీలో చూస్తే 2 వేల 300 కోట్ల వరకు ఉంటుంది. నిజానికి ఎప్పటి నుంచో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంటున్నాయి. కానీ ఈ ఏడాది ఆర్సీబీ వీటిని బీట్‌ చేసేసింది.

ఇక 2 వేల 21 కోట్లతో రెండో స్థానంలో ముంబై ఇండియన్స్, 1963 కోట్లతో మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ ఉన్నాయి. ఈ ఏడాది బ్రాండ్‌ వాల్యూను అమాంతం పెంచుకున్న ఏకైక టీమ్‌ పంజాబ్‌ కింగ్స్. ఈ ఏడాది తమ ఆటతో అందరి మనసులు దోచుకున్న ఈ టీమ్‌ ఏకంగా తమ బ్రాండ్‌ వాల్యూని 39.6 శాతం పెంచుకుంది. ప్రస్తుతం ఈ టీమ్‌ 12 వందల 9 కోట్లతో చివరి నుంచి రెండో స్థానంలో  ఉన్నా.. ఎదుగుదల విషయంలో మాత్రం టాప్‌ ప్లేస్‌లో ఉందని చెప్పాలి. 1946 కోట్లతో కోల్‌కతా నాలుగో స్థానంలో.. 1320 కోట్లతో  సన్ రైజర్స్ హైదరాబాద్  ఐదోస్థానంలో.. 1303 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానంలో, 1252 కోట్లతో రాజస్థాన్‌ ఏడో స్థానంలో.. 1217 కోట్లతో  గుజరాత్ టైటాన్స్ 8వస్థానంలో నిలిచాయి.  ఇక 1046 కోట్లతో లక్నో చివరి స్థానంలో ఉంది. ప్రతి ఏడాది ఐపీఎల్‌ బ్రాండ్  పెరుగుతూ వస్తుంటే..  టీమ్‌ వాల్యూస్ మాత్రం ఆయా జట్ల పర్ఫామెన్స్‌, ఫ్యాన్‌ బేస్‌ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటున్నాయి. మరి నెక్ట్స్‌ సీజన్‌లో ఏ టీమ్‌ వాల్యూ ఎలా మారుతుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu