జగన్ పార్టీ బుద్ధి మరోసారి బయటపడింది!

 

ఎంత దాచుకుందామని, బయటపడకుండా వుందామని ప్రయత్నించినా కొంతమంది బుద్ధి ఇట్టే బయటపడిపోతూ వుంటుంది. ప్రస్తుతం జగన్ పార్టీ అలాంటి స్థితిలోనే వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నా్రు. ప్రస్తుతం జగన్ పార్టీకి చంద్రబాబును ఏదోరకంగా ఇరకాటంలో పెట్టి తాను రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచనలోనే వుంది. తాను కోరుకుంటున్నదాన్ని సాధించడం కోసం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల క్షేమాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టడానికి వెనుకాడటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఉదాహరణగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలకి సంబంధించిన అధికారాలను గవర్నర్‌కి అప్పగించే విషయంలో వైసీపీ నాయకుల స్పందనను చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు సంబంధించిన అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒక్కడానికే ఇవ్వడం వల్ల హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులకు ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం వుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. చంద్రబాబు రాసిన ఈ లేఖ అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇటు తెలంగాణలో వున్న సీమాంధ్రులలో కూడా సంతోషాన్ని కలిగించింది. పోలీసు వ్యవస్థపై గవర్నర్‌కి అధికారాలు కల్పించడం ద్వారా తమకు భద్రత వుంటుందని హైదరాబాద్‌‌లోని సీమాంధ్రులు భావిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష హోదాలో వున్న వైసీపీ మాత్రం దీనికి పెడార్ధాలు తీస్తోంది. గవర్నర్‌కి అధికారాలు ఇవ్వాలంటే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం పెద్ద తప్పని, కేంద్రం కూడా ఆ దిశగా అడుగులు వేయడం అంతకంటే ఘోరమైన తప్పు అన్నట్టుగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో వున్న తెలుగువారికి ఏ సమస్య వచ్చిందని గవర్నర్‌కి అధికారాలు ఇవ్వాలని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమ రాష్ట్రంలో ప్రతిపక్షంగా వున్న వైసీపీ నాయకులు తమకు నష్టం కలిగించే రకంగా మాట్లాడుతూ వుండటం చూసి సీమాంధ్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పోనీలే కదా అని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఈరకంగా వ్యవహరిస్తోంది, పొరపాటుగా అధికారాన్ని ఇచ్చి వుంటే ఇంకెంత దారుణంగా వ్యవహరించేదో అని అనుకుంటున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని విమర్శించడం మానుకుని, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గవర్నర్ చేతిలోకి వెళ్ళేలా సహకరిస్తే మంచిదని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu