భార్య గొంతు కోశాడు..

 

అనుమానం పెనుభూతం అంటారు. భార్య మీద అనుమానాన్ని పెంచుకున్న ఓ భర్త పెనుభూతంలా మారాడు. భార్యని గొంతుకోసి చంపాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా కరగ్రహారం గ్రామంలో జరిగింది. నాగేశ్వరరావు, భూలక్షికి పదిహేనేళ్ళ క్రితం వివాహం జరిగింది. పెళ్ళయినప్పటి నుంచే వీరిద్దరూ నిరంతరం గొడవపడుతూ వుండేవారు. భార్య భూలక్ష్మి మీద నాగేశ్వరరావు నీకు వివాహేతర సంబంధాలు వున్నాయంటూ నిందలు వేసేవాడు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి సమయంలో వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో రగిలిపోయిన నాగేశ్వరరావు కత్తితో భూలక్ష్మి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu