నెల్లూరు సమీపంలో రైలు ప్రమాదం

 

ఆదివారం తెల్లవారుజామున కన్యాకుమారి నుంచి హౌరా వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. నెల్లురు జిల్లా కావలి సమీపంలో వేగంగా వెళుతున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌ ఆవులను డీకొట్టి పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.

ట్రైన్‌ వేగంగా ప్రయాణిస్తుండటంతో ఆవులను డీకొట్టిన వెంటనే చాలా భోగిలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 12 ఆవులు అక్కడికక్కడే మరణించాయి. అయితే ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu