మరో ఉద్యమానికి కెసిఆర్ పిలుపు
posted on Sep 21, 2013 9:10PM
.jpg)
సమైక్యాంద్ర ఉద్యమం ఉదృతంగా నడుస్తున్న నేపధ్యంతో తెలంగాణ నాయకులు కూడా ఉద్యమ కార్యచరణ సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం టీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌తో ఓయూ జేఎసి నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో చర్చించిన కెసిఆర్ ప్రత్యేఖ రాష్ట్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే నెల 5లోపు కేభినెట్ నోట్ వస్తుందన్న కెసిఆర్, హైదరాబాద్ పై కేంద్ర వైఖరి ఎలా ఉండబోతుందో కూడా తెలిపారు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ తో పాటు రెవెన్యూకు సంబందించిన అన్ని అధికారాలు కేంద్రం తన వద్దే ఉంచుకునే అవకాశం ఉందన్నారు. తాము కోరుకున్న తెలంగాణ ఇది కాదన్న కెసిఆర్ మరో ఉద్యమానికి విద్యార్ధులు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.