ఇల్లు మారనున్న సీఎం చంద్రబాబు
posted on Oct 6, 2014 11:35AM
.jpg)
ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో ఇల్లు మారనున్నారు. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్‌లోని సొంత ఇంటి నుండి లేక్ వ్యూ అతిథి గృహానికి మారాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవలి వరకు లేక్ వ్యూ అతిథి గృహం ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉంది. సచివాలయంలో సీఎం కార్యాలయం సిద్ధం కాకపోవడంతో ఇప్పటి వరకు లేక్ వ్యూ అతిథి గృహం నుండే అధికారిక కార్యకలాపాలు నిర్వహించారు. ఈ దసరా పండుగ నాటికి సచివాలయంలోని తన కార్యాలయం సిద్ధం కావడంతో బాబు అక్కడికి మారారు. ఈ నేపథ్యంలో లేక్ వ్యూను తన అధికారిక నివాసంగా మార్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆదివారం నాడు ఆయన కుటుంబ సభ్యులు లేక్ వ్యూ అతిథి గృహాన్ని పరిశీలించారు. అవసరమైన మార్పులు, చేర్పులు చేసిన తర్వాత డిసెంబరు నెలలో లేక్ వ్యూ అతిథి గృహానికి బాబు కుటుంబం మారనున్నట్టు తెలుస్తోంది.