చంద్రబాబు - కేసీఆర్ అలయ్ బలయ్.. హ్యాపీ.. హ్యాపీ

 

భారతీయ జనతాపార్టీ నాయకుడు, సికింద్రాబాద్‌ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాడీ నిర్వహించే ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం ఆదివారం నాడు జలవిహార్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, బీజేపీ రాష్ట్ర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu