హీరో నవదీప్‌పై డ్రగ్స్ కేసు.. కొట్టేసిన హైకోర్టు
posted on Jan 9, 2026 1:45PM
.webp)
టాలీవుడ్ హీరో నవదీప్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. నవదీప్‌పై గతంలో నమోదైన డ్రగ్స్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నిందితుడిగా చేర్చడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ కేసుపై విస్తృతంగా వాదనలు విన్న హైకోర్టు.. నవదీప్ వద్ద ఎలాంటి మాదక ద్రవ్యాలూ స్వాధీనం కాలేదని స్పష్టం చేసింది. కేవలం ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చడమే తప్ప, అతనికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలూ లేవని పేర్కొంటూ కేసు కొట్టివేసింది.
నవదీప్ వద్ద డ్రగ్స్ లభించకపోవ డంతో పాటు, అతడిపై నమోదైన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు సంస్థలు సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లో పేరు ఉన్నంత మాత్రాన క్రిమినల్ కేసును కొనసాగించడం చట్టబద్ధం కాదనీ, అందుకే నవదీప్‌పై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టేస్తున్నట్లు వెల్లడించింది.
నవదీప్ తరఫున హైకోర్టులో ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ తన వాదనలు వినిపించారు. నవదీప్‌పై ఉద్దేశపూర్వకంగా కేసు బనాయించారని, ఎలాంటి ఆధారాలు లేకుండానే అతడిని నిందితుడిగా చేర్చారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదన లను పరిగణనలోకి తీసు కున్న హైకోర్టు కేసును కొట్టివేసింది.హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హీరో నవదీప్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసును కొర్టు కొట్టివేయడంతో ఆయన నిర్దోషిగా నిరూపితుడయ్యారని నవదీప్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.