ఫ్రం 24 టు నంబర్ వన్.. ఏపీ పంచాయతీరాజ్ పై పవన్ ముద్ర
posted on Dec 24, 2025 11:55AM
.webp)
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ శాఖపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన ముద్ర వేయడంతో అనతి కాలంలోనే ఏపీ పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేయడం వల్లనే ఇది సాధ్యమైందని పరిశీలకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తు న్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన కృషి ఫలితంగా ఆ శాఖలు జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించాయి. గతంలో ఉద్యోగుల శిక్షణ, సామర్థ్యాభివృద్ధి విషయంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, పవన్ కల్యాణ్ ఆ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. జాతీయ పంచాయతీ అవార్డులలో ఏపీకి నాలుగు అవార్డులు లభించాయి. మొత్తంగా పంచాయతీరాజ్ శాఖ పనితీరు విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ గా నిలిచింది.