జ్యుస్ తాగుతుండగా హార్ట్ ఎటాక్‌తో యువకుడి మృతి

 

కరోనా అనంతరం చాలామంది యువ కులు ఉన్నట్లుండి ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ కు గురవు తున్నారు. గతంలో ఓ యువకుడు జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ.... మరొకరు కాలేజీలో... ఇంకొకరు బస్ స్టాప్ లో ఇలా పలువురు  యువకులు మృతి చెందారు. ఇప్పుడు తాజాగా మరొకటి చోటు చేసుకుంది.

జ్యుస్ తాగుతూ హార్ట్ ఏటాక్ తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా లోని పల్లి పాడు గ్రామానికి చెందిన మేడ ఏకలవ్య(30) అనే యువకుడు ఉద్యోగం కోసం హైదరాబాదు నగరానికి వచ్చి ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఒక రూమ్ లో ఉంటూ ... ఉద్యోగం కోసం వేట కొనసాగించాడు.

అయితే ఏకలవ్య బుధవారం రాత్రి 8.30గంటల సమయంలో రిలయన్స్ ట్రెండ్స్ ముందు జ్యుస్ పాయింట్ వద్ద జ్యుస్ త్రాగుతూ.. అకస్మాత్తుగా కిందపడిపోయాడు.  అది గమనించిన స్థానికులు అతని వద్దకు వెళ్లి అతనికి  సిపిఆర్ చేశారు... కానీ అప్పటికే అతను మృతి చెందాడు. 

దింతో  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని  మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంప ట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దృశ్యాలు అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు వాటిని ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu