అదానీకి సెబీ క్లీన్‌చిట్
posted on Sep 18, 2025 9:05PM
.webp)
సెబీ తాజాగా గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలకు సంబంధించి క్లీన్‌చిట్ ఇచ్చింది. 2023లో వచ్చిన హిండెన్‌బర్గ్ నివేదికలో స్టాక్ అవకతవకలు, నిధుల మళ్లింపులు, అకౌంటింగ్ మోసాలు జరిగాయంటూ ఆరోపించినా, విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టు కమిటీ కూడా ఇలాంటి ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. ఈ నిర్ణయంతో అదానీ షేర్లకు ఊరట లభించింది. హిండెన్‌బర్గ్ తప్పుదోవ పట్టించినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలని గౌతమ్ అదానీ డిమాండ్ చేశారు.
2023 జనవరిలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిన తర్వాత అదానీ షేర్లు క్షీణించి, 150 బిలియన్ డాలర్ల విలువ చెరిపేశాయి. తరువాత సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ కూడా ఆధారాలు లేవని తెలిపింది. ఇప్పుడు సెబీ క్లీన్‌చిట్‌తో గ్రూప్ షేర్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ పరిణామంపై గౌతమ్ అదానీ స్పందిస్తూ, తమపై వేసిన తప్పుడు ఆరోపణలు పెట్టుబడిదారులను నష్టపరిచాయని, దేశానికి క్షమాపణ చెప్పాలని హిండెన్‌బర్గ్‌ను డిమాండ్ చేశారు. “సత్యమేవ జయతే… జైహింద్!” అంటూ ఆయన పోస్ట్ ముగించారు.