జగన్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ

పల్నాడు పర్యటనలో తన వాహనం ఢీ కొని సింగయ్య మరణించిన ఘటనపై జగన్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.   దీంతో  ఆ పార్టీ నేతలకు పల్నాడు ఫియర్ పట్టుకుంది. పోలీసుల ఆంక్షలను సవాల్ చేస్తూ జగన్ పల్నాడులో భారీ జన సందోహాన్ని మోహరించడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.

నమోదైన కేసు నాన్ బెయిలబుల్ కే  కావడంతో జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై కోర్టులో గురువారం (జూన్ 26)  విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో  శుక్రవారానికి (జూన్ 27) వాయిదా పడింది.   రాజకీయ ప్రతీకారంతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైన సెక్షన్లు పెట్టారని  జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసును కొట్టేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.