న్యాయపోరాటానికి దిగిన టీమిండియా మాజీ కెప్టెన్
posted on Jan 20, 2017 10:45AM

హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ న్యాయపోరాటానికి దిగారు. ఎన్నికల నిర్వహణ, వాటి పర్యవేక్షణ నిమిత్తం అడ్వకేట్ కమిషనర్‌ను ఏర్పాటు చేస్తూ రంగారెడ్డి జిల్లా ఐదవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్వర్వులను కొట్టేయాలని కోరుతూ అజహర్ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిగే వరకు ఎన్నికల ఫలితాలు వెల్లడించకుండా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. లోథా కమిటీ సిఫారసులకు విరుద్దంగా రిటర్నింగ్ అధికారి ఎన్నికలను నిర్వహించారని..కొందరు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. దీనిని విచారించిన జస్టిస్ ఎ.వి. శేషసాయి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.