హిమాచల్ ప్రదేశ్‌కి రెండో రాజధాని
posted on Jan 20, 2017 10:28AM

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వ్యూహత్మక నిర్ణయం తీసుకున్నారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్. ధర్మశాలను రాష్ట్ర రెండో రాజధానిగా ప్రకటించారు సీఎం. ధౌలాధర్ పర్వతశ్రేణిలో ఉన్న ధర్మశాల చాలా అద్భుతమైన ప్రదేశమని..దీనికి చారిత్రక నేపథ్యం కూడా ఉందన్నారు..అలాంటి ధర్మశాలకు రెండో రాజధాని అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ నిర్ణయాన్ని మరో కోణంలో చూస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో 25 సీట్లకు సమీప నగరం ధర్మశాల. ఆ ప్రాంత వాసులు ఉపాధి, విద్య తదితర అవసరాల కోసం ధర్మశాలపైనే ఎక్కువ ఆధారపడుతుంటారు..అలాంటి ఈ నగరాన్ని రాజధానిగా ప్రకటించడం ద్వారా ఈ ప్రాంతవాసులను ఆకట్టుకోవాలన్నది ముఖ్యమంత్రి వ్యూహంలా కనిపిస్తోందని వారి భావన.