అమెరికాను తలదన్నేలా హైదరాబాద్ లో గన్ కల్చర్.. తాజాగా చందానగర్ లో కాల్పుల కలకలం

ఖజానా జువెల్లరీస్ లో దోపిడీ 

భాగ్యనగరంలో గన్ కల్చర్ పెరిగిపోతున్నది. అమెరికాను తలదన్నేలా ఇటీవలి కాలంలో భాగ్యనగరంలో కాల్పులు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ చందానగర్ లో దుండగులు కాల్పులతో చెలరేగిపోయారు. గ్రేటర్ పరిధిలోనే అత్యంత రద్దీగా ఉండే చందానగర్ లో దుండగులు తుపాకులతో ఖజానా జువెల్లర్స్ లోకి ప్రవేశించి భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు కాల్పులకు తెగబడి మరీ భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుండగుల కాల్పుల్లొ ఖజానా జువల్లర్స్ సిబ్బంది గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం ( ఆగస్టు 12) ఉదయం జరిగింది.

షాపు తెరిచిన  షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే భారీ దోపిడీకి పాల్పడి అక్కడ్నుంచి ఉడాయించారు.  షాపు సిబ్బంది, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరిపి దోపిడీ జరిపిన తరువాత దుండగులు జహీరాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు జిల్లా సరిహద్దులలో పోలీసులను అప్రమత్తం చేశారు.

దుండగులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  ముఖానికి  మాస్కులు,   చేతులకు గ్లౌజు  వేసుకొని వచ్చిన ఆరుగురు దుండగులు, ముందుగా తుపాకులతో బెదరించి లాకర్ కీస్ ఇవ్వాలని కోరారు. అయితే అందుకు ఖజానా జువెల్లరీస్ మేనేజర్ నిరాకరించి, వారిని ప్రతిఘటించాడు. దీంతో  మేనేజర్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.  ఆ దశలో ఖజానా జువెల్లర్స్ లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం  దుండగులపై తిరగబడ్డారు..దీంతో దుండగులు పారిపోయారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu