వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ అయిన గొట్టిపాటి ఫ్లెక్సీలు చించివేత.. వారిపనేనా..?

 

టీడీపీలో విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మూడు రోజుల క్రితమే టీడీపీలో చేరిన సంగతి తెలసిందే. అయితే గొట్టిపాటి ఎంట్రీని ఎప్పటినుండో వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేశ్.. గొట్టిపాటి చేరికను అడ్డుకోవడానికి శత విధాలా ప్రయత్నించారు. కానీ చంద్రబాబు స్వయంగా కరణాన్ని పిలిచి బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. అయితే గొట్టిపాటి టీడీపీలోకి చేరినా వారి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గొట్టిపాటి టీడీపీలోకి చేరిన సందర్భంగా అద్దంకి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్లెక్సీలను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని నిందితులు కొందరు చించివేసారు. దీంతో గొట్టిపాటి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసనగా ఆందోళనకు దిగారు. మరోవైపు ఇది కరణం వర్గీయుల పనే అంటూ కొందమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu