జీఎన్ ఏ  డిఎన్ ఏ ..మోడీ ఫైడ్‌... ఆజాద్‌పై కాంగ్రెస్ పంచ్‌లు

పార్టీనుంచి బ‌య‌ట‌ప‌డిన‌పుడే అవ‌త‌లి వ్య‌క్తి నిజ‌స్వ‌రూపాలు బ‌య‌ట‌ప‌డ‌టం ఈమ‌ధ్య కాంగ్రెస్‌కీ అను భ‌వమ‌వుతోంది. సీనియ‌ర్ నేత గులాంన‌బీ అజాద్ పార్టీ ప‌ద‌వులు, స‌భ్య‌త్వాన్ని కాద‌ని బ‌య‌ట ప‌డ్డారు. అయితే దాని వ‌ల్ల త‌మ‌కు న‌ష్టం లేద‌న్న‌ట్టుగా కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నారు. ఆజాద్‌కి బీజేపీ వారి ప‌ట్ల అనూహ్య‌రీతిలో ప్రేమ క‌ల‌గ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్య‌ప‌డ‌న‌వ‌స‌రం లేద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు అంటున్నా యి. జీఎన్ ఏ (గునాంన‌బీ ఆజాద్‌) డీఎన్ఏ మోడీ ఫై అయింద‌ని పంచ్‌లు విసురుతు న్నారు. పార్టీ నాయ కత్వం పట్ల ద్రోహానికి పాల్పడి.. తన నిజ స్వరూ పాన్ని బయటపెట్టారని దుయ్య బట్టారు. 

ఆజాద్‌ రిమోట్‌ కంట్రోల్‌ ప్రధాని మోదీ చేతిలో ఉందని, ఈ విషయం రాజ్యసభ పదవీ కాలం ముగిసిన సమయంలోనే బయటపడిందని విమర్శించారు. ఆజాద్‌, మోదీల మధ్య ప్రేమ పార్లమెంటులోనే కని పించింద‌ని వ్యాఖ్యానించారు. తొలుత మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత పద్మవిభూషణ్‌ ఇచ్చారు. అనంతరం నివాస సదుపాయాన్ని పొడిగించారు. 

ఇవేమీ యాదృచ్చికంగా జరిగినవికాదు. వ్యూహాత్మకంగా, సహకార పద్ధతిలో జరిగినవేన‌ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి జైరాం రమేశ్‌ దుయ్యబట్టారు. తన రాజీనామా లేఖలో అగ్ర నేత రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని రమేశ్‌ తప్పుబట్టారు.  

పార్టీని బలహీన పరుస్తున్నవారే.. పార్టీ బలహీనపడిందని ఎదురు దాడి చేస్తున్నారని మీడియా విభాగం ఇన్‌చార్జి పవన్‌ ఖేరా నిప్పులు చెరిగారు. ఆజాద్‌ రాజీనామా జీ-23 నేతలను కూడా విస్మయానికి గురి చేసిం ది. తాము కోరుకున్నది ఇది కాదని వారిలో ఒకరైన మాజీ ఎంపీ సందీప్‌ దీక్షిత్‌ అన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu