క‌ర్ణాట‌క విద్యారంగం పై మోదీకి  ఫిర్యాదు

క‌ర్ణాట‌కాలో అవినీతి మితిమీరింద‌ని రాష్ట్రంలో విద్యాసంస్థ‌ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాఠశాల‌ల‌కు గుర్తింపు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికీ లంచాలు డిమాండ్ చేయ‌డం దారుణ‌మ‌ని, దీనిపై వెంట‌నే ద‌ర్యాప్తు చేప‌ట్టా ల‌ని ప్ర‌ధాని మోదీకి రాసిన లేఖ‌లో కోరారు. 

ది అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్, ది రిజిస్టర్డ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఈ లేఖను రాశాయి. దాదాపు 13వేల  ప్రైవేటు పాఠశా లలు, విద్యా సంస్థలకు ఈ సంఘాలు ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. అశాస్త్రీయమైన, హేతుబద్ధత లేని, వివక్షాపూరితమైన, ఆచరణ సాధ్యంకానటువంటి నిబంధనలను కేవలం అన్ఎయిడెడ్ పాఠశా లలకు మాత్రమే వర్తింపజేస్తోందని ఈ లేఖలో మోదీకి తెలిపాయి. అవినీతి తారస్థాయిలో ఉందని ఆరోపిం చాయి.
 
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌కు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం కనిపించలేదని చెప్పా యి. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అస‌లు విద్యావ్యవ‌స్థ‌నే నీరుగార్చార‌ని ఆరోపించారు. బడ్జెట్ స్కూళ్ల‌కు ఇద్ద‌రు బీజేపీ విద్యాశాఖా మంత్రులు తీర‌ని న‌ష్టం చేశార‌ని ఆరోపిం చాయి. అంతే గాక‌, పెట్టుబ‌డిదారుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి విద్యాశాఖ ఆస‌క్తి చూప‌డంలేద‌ని పేర్కొన్నారు. 

బడ్జెట్ స్కూళ్ళకు ఇద్దరు బీజేపీ విద్యాశాఖ మంత్రులు తీరని నష్టం చేశారని ఆరోపించాయి. తల్లి దండ్రుల నుంచి భారీ స్థాయిలో ఫీజులు గుంజుతున్న పాఠశా లల కన్నా బడ్జెట్ స్కూళ్ళను దారుణంగా దెబ్బతీశారని పేర్కొన్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu