అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
posted on Aug 28, 2025 11:57AM

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిన్నెసోటా మినియాపొలిస్‌లో ని ఓ పాఠశాలలోకి ప్రవేశించిన సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరో 14 మంది చిన్నారులు సహా 17 మంది గాయపడ్డారు. విద్యార్థులు ప్రార్థన చేస్తుండగా దుండగుడు చర్చి కిటికీల గుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
కాల్పులకు తెగబడిన వ్యక్తిని 23 ఏళ్ల రాబిన్ వెస్ట్ మ్యాన్ గా గుర్తించారు. కాల్పులకు పాల్పడిన సాయుధుడు తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులకు స్వాధీనం చేసుకున్న తుపాకీపై న్యూక్ ఇండియా’ , మాషా అల్లా అని ఉంది. కాల్పుల ఘటనకు ముందు అతడుసోషల్ మీడియాలో పలు వీడిమోలు పోస్టు చేశాడు.