రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఫేక్ వీడియో.. ఛత్తీస్ గఢ్ లోఇద్దరు బీజేపీ ఎంపీలపై ఎఫ్ఐఆర్

ఫేక్ వార్తల ప్రచారం, వీడియోల ప్రసార విషయాలలో బీజేపీ ఇంత కాలం తాను పవిత్రంగా ఉన్నానంటూ చేసుకుంటున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని తేలిపోయింది.  విప‌క్షాల‌పై దుష్ప్రాచారానికి వీడియో టేప్‌ల‌ను విడుదల చేయడమనే దుష్ట సాంప్రదాయం అంటని సచ్ఛీలత మాది అంటున్న బీజేపీ బండారం బయటపడిపోయింది. పేక్ వార్తలు, వీడియోల విషయంలో బీజేపీకి మినహాయింపు ఏమీ లేదని తేటతెల్లమై పోయింది.   రాహుల్ గాంధీకి వ్య‌తి రేకంగా ఫేక్ వీడియో విడుదల చేసినందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలపై ఛత్తీస్ గడ్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది.  

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో రాహుల్‌గాంధీకి సంబంధించి విడుద‌లైన వీడియో మ‌త‌ సామ‌ర‌స్యానికి భంగం క‌లిగించే దిలా వుంద‌ని దాఖ‌లైన ఫిర్యాదుపై బీజేపీ ఎంపీలు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, సుబ్రత్ పాఠక్‌లపై ఎఫ్ఐ ఆర్ నమోదు అయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఎంపీలతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఆ పార్టీ మీడియా పబ్లిసిటీ టీమ్ చీఫ్ పవన్ ఖేరా తెలిపారు. ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్ లో  కూడా కాంగ్రెస్ వారిపై ఫిర్యాదులు చేసిందని, ఖేరా, ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సుప్రియా శ్రీనాటే విలేకరులతో అన్నారు.  

రాహుల్ పై ఫేక్ వీడియోలు విడుదల చేసి  బీజేపీ ఎంపీలిద్దరూ దేశద్రోహానికి పాల్పడ్డారని ఆయన దేశంలో మత సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశంతో కేంద్ర మాజీ మంత్రి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే, అది దేశద్రోహమేనని ఆమె ఆరోపిం చారు.  అబ‌ద్ధ వార్త‌లు ప్ర‌చారంచేసేవారికి  బీజేపీలో ప్రమోషన్లు వస్తున్నాయన్నారు.    హైదరాబాద్‌లో ప్రధాని దాదాపు అరగంట సేపు మాట్లాడారని, అయితే శాంతి, మత సామరస్యం కోసం కోసం ఒక్క విజ్ఞప్తి కూడా చేయలేదని ఆమె అన్నారు.