రాహుల్ ఫేక్ వీడియో కేసు.. టీవీ యాంకర్ అరెస్ట్

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాజీ  అధ్యక్షుడు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనా పార్లమెంట్ సభుడు. అక్కడ ఆయనకో ఆఫీస్ వుంది.. ఆ ఆఫీస్ పై దాడి జరిగింది. ఆ దాడిచేసింది ఎవరు, ఏమిటి అనేది పస్తుతానికి అప్రస్తుతమే అయినా, అధికార సిపిఎం పార్టీ అనుబంధ విద్యార్ధి విభాగం, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు రాహుల్ గాంధీ కార్యాలయం పై దాడి చేసినట్లు సమాచారం. కేరళలోని అటవీ ప్రాంతాల్లో బఫర్‌ జోన్ల ఏర్పాటు విషయంలో స్థానిక ఎంపీ రాహుల్‌ జోక్యం చేసుకోవడం లేదని, అసలు యాన్ కనిపించడమే లేదని  నిరనసకు దిగిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. 80-100 మంది కార్యకర్తలు రాహుల్‌ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల్లో 8 మందిని పోలీసులు అదుపులోకి తేసుకున్నారు.

రాహుల్  గాంధీ కార్యాలయంపై దాడి ఘటనపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ కార్యాలయంపై దాడిని చేయించింది కేరళలోని అధికార పార్టీ సీపీఎంకు చెందిన విద్యార్థి విభాగం కార్యకర్తలే అని ఆరోపించారు. అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు సిపిఎం ప్రభుత్వాని డిమాండ్ చేశారు.  అయితే, రాహుల్ ‘గాంధీ’ దాడిని ఖండిస్తూనే, “అయినా వారు చిన్న పిల్లలు. వారిని క్షమింపుడు” అంటూ, పోలీసులు అదుపులోకి తీసుకున ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను క్షమించి వ‌దిలి పెట్టాల‌ని పోలీసులను  కోరుతూ ఒక వీడియో విడుదల చేశారు . 

అయితే ఈ వీడియోను జీ న్యూస్ త‌ప్పుగా ప్లే చేసింది. రోహిత్‌ రంజన్... జీ టీవీ ఛానెల్‌లో పేరుగాంచిన డీఎన్‌ఏ షోకి వ్యాఖ్యతగా చేస్తున్నాడు. రాహుల్‌ గాంధీ వయనాడ్ లో తన ఆఫీస్ పై జరిగిన దాడి గురించి వీడియో రిలీజ్ చేయగా..దాన్ని ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ ని ముస్లిం యువకులు హత్య చేసిన ఘటనకి లింక్ చేస్తూ వీడియోను టీవీలో ప్లే చేశారు. ఉద‌య్‌పూర్ నిందుతులని వ‌దిలిపెట్టాల‌ని రాహుల్ చెప్పినట్లు ఉద్దేశం వ‌చ్చేలా రాహుల్ వ్యాఖ్యలను వక్రీకరించి వీడియోను ప్లే చేశారు.దాని మీద రాహుల్ గాంధీని త్రోల్ చేస్తూ, వేల సంఖ్యలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జీ టీవీ న్యూస్‌ యాంకర్‌ రోహిత్‌ రంజన్‌ పై చత్తీస్‌గఢ్‌, రాజస్తాన్ రాష్గ్రాల్లో కేసులు నమోదయ్యాయి.

కాగా, మంగళవారం ఉదయం ఘజియాబాద్ పోలీసులు ఢిల్లీ శివార్లలోని రోహిత్ నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి చత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిచగా ఘజియాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగి రంజన్‌ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే నాటకీయ పరిణామాల మధ్య అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదలా ఉంటే, ఇప్పడు నేరం చేసిన వారిని రాహుల్ గాంధీ వదిలేయమని ఎలా చెపుతారని, కొదరు ప్రశ్నిస్తున్నారు. నిజమే, కారణాలు ఏవైనా తప్పు చేసిన వారిని క్షమింఛి వదిలేయడం వలన వారు మళ్ళీ అదే తప్పు చేసే ప్రమాదం ఉందని..,సోచిన్నా పెద్ద అనే తేడాలేకుండా తప్పు చేసిన వారిని తగిన విధంగా శిక్షించ వలసిందే అంటున్నారు.