ఈటీవీలో జగన్ న్యూస్... ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్
posted on Oct 7, 2015 7:20PM

రామోజీతో జగన్ భేటీ రహస్యమేమిటో ఇప్పుడు బయటపడుతోంది, ఫిల్మ్ సిటీకి వెళ్లిమరీ రామోజీరావును ప్రసన్నం చేసుకోవడంతో జగన్ కు పెద్దాయన ఆశీస్సులు లభించినట్లే కనిపిస్తోంది, అందుకే గుంటూరులో జగన్ చేపట్టిన దీక్షకు ఈటీవీ ఫుల్ కవరేజీ ఇస్తోంది, జగన్ గురించి నెగటివ్ స్టోరీలు తప్ప పాజిటివ్ కథనాలను కనీసం నిమిషం కూడా చూపించని ఈనాడు గ్రూప్... గుంటూరు దీక్షలో జగన్ చేసిన ప్రసంగాన్ని ఏకంగా అరగంటపాటు ఈటీవీ2లో లైవ్ టెలికాస్ట్ చేసింది, పైగా జగన్ మాట్లాడిన ముఖ్యమైన అంశాలను బ్రేకింగ్ న్యూస్ కింద సైడ్లో వేస్తూ నానా హంగామా చేసింది.
ఈటీవీ ఛానెల్స్ లోనే కాకుండా ఈనాడు పత్రిక ఏపీ మెయిన్ ఎడిషన్లో కూడా జగన్ దీక్ష గురించి రాయడం చూస్తుంటే రాజగురువు ఆశీస్సులు ఏ స్థాయిలో లభించాయో అర్థంచేసుకోవచ్చు, జగన్ కు బద్ధవ్యతిరేకి అయిన మరో పత్రిక ఆంధ్రజ్యోతిలో కూడా జగన్ దీక్షపై ఫస్ట్ పేజ్ లో ఆర్టికల్ ఇవ్వడం సెన్షేషన్ కిందే చెప్పుకోవాలి, సాక్షిలో తప్ప ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో జగన్ గురించి ఇలా మెయిన్ పేజీలో ఐటెమ్స్ రావడం చూస్తుంటే వింతే మరి, ఎందుకంటే ఈ రెండు పత్రికల్లో జగన్ కి సంబంధించి నెగటివ్ వార్తలు తప్ప... మిగతావన్నీ లోపలి పేజీల్లో ఎక్కడో ఒక మూల చిన్న ఆర్టికల్ వేసి చేతులు దులుపుకునేవారు
అయితే జగన్మోహన్ రెడ్డి... ఫిల్మ్ సిటీకి రామోజీని కలిసిన రోజే జగన్ పై నెగటివ్ కథనాలు వేయొద్దని ఈనాడు సిబ్బందికి పెద్దాయన నుంచి ఆదేశాలు వెళ్లాయని టాక్ ఉంది, పైగా జగన్ కార్యక్రమాలు ఏవైనా చంద్రబాబుకిచ్చినట్లే కవరేజీ ఇవ్వాలని చెప్పారట, దాంతో జగన్ కు ఈమధ్య బాగానే పబ్లిసిటీ వస్తోందని, గుంటూరు దీక్ష ఓ రేంజ్ లో కవరేజీ లభిస్తోందని వైసీపీ లీడర్స్ ఖుషీ అవుతున్నారట.