ఈట‌ల కొత్త పార్టీ బీజేఎస్?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ నాయకుడు.. ప్ర‌స్తుత బీజేపీ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ కొత్త పార్టీ పెడుతున్న‌ట్టుగా  వార్త‌లు జోరుగా విన‌వ‌స్తున్నాయి. ఆ పార్టీ పేరు బహుజన జనతాసమితిగా   ప‌లువురు సోష‌ల్ మీడియాలో పోస్ట‌ర్లు వేసి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు. ఈటల కొత్త పార్టీ పెట్టడం, దాని పేరు బహుజన జనతా సమితి (బీజెఎస్ గా పలువురుు ధృవీకరణలు కూడా చేసేస్తున్నారు. ఈటల ప్రస్తతం ఉన్న బీజేపీ,  గతంలో ఉన్న  బీఆర్ఎస్ రెంటినీ స్ఫురింప చేసేలా బీజెఎస్  అనే పేరును ఈటల ఫిక్స్ చేసినట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  

రాష్ట్రంలో ఇప్ప‌టికే బీసీల ఓటు బ్యాంకు కోసం పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది.  ఒక ప‌క్క అధికార  కాంగ్రెస్ బీసీల రిజ‌ర్వేష‌న్ల కోసం ఆర్డినెన్స్ తీసుకువస్తుంటే.. ఈ ఆర్డినెన్స్ బ‌హు బాగున్న‌దంటూ బీఆర్ఎస్ తిరుగుబాటు నేత కల్వకుంట్ల క‌విత కాంప్లిమెంట్ ఇచ్చేశారు. అస‌లు బీసీల‌కూ నీకూ ఏం సంబంధం? నీకూ బీసీల‌కు కంచం పొత్తా- మంచం పొత్తా అంటూ మ‌ల్ల‌న్న స్ట్రాంగ్ కౌంట‌ర్లు ఇస్తుంటే.. ఈటల నేతృత్వంలో మ‌రో కొత్త బీసీల వేదిక త‌యారైందంటూస‌మాచారం. 

అచ్చం వైసీపీలా స‌న్నిహితుల పేరిట ఈ బీజెఎస్ రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్ పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకే ప్ర‌తి వార్డు మెంబ‌రూ మ‌న‌వాళ్లే అంటూ మెసేజ్ లు పంపుతున్న‌ట్టు చెబుతున్నారు. అయితే ఈట‌ల వ‌ర్గం మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నాయి.  అయితే ఈట‌ల అభిమానుల నుంచి అయితే కొత్త పార్టీ పెట్టాల్సిందే అన్న ఒత్తిడి వ‌స్తున్న‌ట్టు స్వ‌యానా ఈట‌ల వ‌ర్గ‌మే చెబుతోంది. ఒక వేళ  ఈట‌ల  పార్టీ పెడితే లాభ‌న‌ష్టాల బేరీజు ఎలాంటిది? కులాల ఈక్వేష‌న్ల‌ను క‌లుపుకుపోవ‌డం ఎలా? బ‌హుజ‌న శ‌బ్ధం తో పార్టీ పెడితే ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తుంది? అన్న విషయంపై ఈటల టీమ్ సీరియస్ గా  పని చేస్తున్నట్లు తెలుస్తోంది.  మ‌రి చూడాలి ఈ పార్టీ పుట్టుక- మ‌నుగ‌డ- రాణింపు అనే  అనే అనుమానాలు, సందేహాలను ఈటల ఎలా నివృత్తి చేస్తారో. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu