ప్రేమ సహజీవనం ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్న నిందితుడు అరెస్ట్
posted on Dec 21, 2025 3:18PM

ప్రేమ పేరుతో యువతులను వలలో వేసి, సహజీవనం ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్న అంతర్జాతీయ మత్తు పదార్థాల ముఠా వ్యవహారాన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో – హెచ్ న్యూ అధికారులు బట్టబయలు చేశారు. ఈ కేసులో యోమెన్‌కు చెందిన ఒక నైజీరియన్ వ్యక్తిని అధికా రులు అరెస్ట్ చేశారు. విద్యార్థి వీసాపై భారత్‌కు వచ్చిన నిందితుడు, గత నాలుగేళ్లుగా పోలీసుల చేతికి చిక్కకుండా డ్రగ్స్ విక్రయాలు చేస్తూ, యువతు లను తన అక్రమ కార్యక లాపాలకు ఏజెంట్లుగా మార్చుకుంటున్నట్లు భారీ ఎత్తున డబ్బులు సంపా దిస్తూ... ఎంజాయ్ చేస్తు న్నాడని విచారణలో వెల్లడైంది.
ప్రేమ పేరుతో యువతులకు గాలం
ఈ నైజీరియన్ ప్రేమ పేరుతో యువతులను మోసం చేసి ఈ అక్రమ డ్రగ్స్ దందాలోకి దింపేవాడు. ఇప్పటివరకు ఏడుగురు యువతులతో ప్రేమ, సహజీవనం పేరుతో సంబంధాలు కొనసా గించి నట్లు అధికారులు గుర్తిం చారు.యువతులను టార్గెట్ చేసిన నిందితుడు డ్రగ్స్ అలవాటు పడిన యువతు లను ముందుగా గుర్తించి, వారికి ఉచితంగా మత్తు పదార్థాలు అందిస్తూ పరిచ యం పెంచుకున్నాడు.
ఆ తరువాత ప్రేమ, సహజీవనం పేరుతో వారిని తన నియంత్ర ణలోకి తీసుకున్నాడు. అనంతరం డ్రగ్స్ సరఫరా, తర లింపు బాధ్యతలను వారిపైనే మోపుతూ ఏజెంట్లుగా మలి చేవాడు.నగరాలు మారుతూ దందా మూడు నెలలకు ఒకసారి ఒక నగరం నుండి మరొక నగరానికి మారుతూ పోలీసులకు చిక్కకుండా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతు న్నాడు...
హైదరాబాద్, బెంగళూరు, గోవా నగరాల్లో ఇప్పటికీ ఐదు ఇళ్లను అద్దెకు తీసుకుని డ్రగ్స్ దందా యదేచ్చగా సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకే చోట ఎక్కువ కాలం ఉండకుండా మారుతూ ఉండటంతో నాలుగేళ్లుగా పోలీసుల కంట పడకుండా తప్పించుకున్నాడు.కొంపల్లి ఘటనతో ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది.
కొంపల్లిలో నర్సుగా పనిచే స్తున్న ఓ యువతితో పరిచయం పెంచుకున్న నిందితుడు, ప్రేమ పేరుతో ఆమెతో సహజీవనం చేస్తూ, ఆమె నివాసంలోనే మత్తు పదార్థాలను నిల్వ చేశాడు. అను మానాస్పద సమాచారం అందడంతో నార్కోటిక్ అధి కారులు దాడులు నిర్వహిం చగా, ఈ డ్రగ్స్ అక్రూ దందా కాస్త వెలుగులోకి వచ్చింది.
కోడ్ భాషలో డ్రగ్స్ లావా దేవీలు డ్రగ్స్ విక్రయా లకు నిందితుడు ప్రత్యేక కోడ్ భాషను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మూడు ప్రశ్నార్థక చిహ్నాలు (???) పంపితే – “మాల్ కావాలి” అనే అర్థం....
నిందితుడి నుంచి మూడు చుక్కలు (…) వస్తే – డ్రగ్స్ రెడీగా ఉన్నట్లు సంకేతం...
ఓషన్ గంజా కోసం “సముద్రం” అనే పదం.
గ్రీన్ MDMA కోసం ప్రత్యేక సింబల్స్ వినియోగం.
ముంబైలో డ్రగ్స్ స్మగ్లర్లు MDMAకు ఉపయోగిస్తున్న కోడ్ భాషను ఇప్పటికే HNEW పోలీసులు గుర్తించారు. ఈ నిందితుడి కమ్యూనికేషన్‌ను ట్రాక్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.డ్రగ్స్ సరఫరాలో అన్ని రకాల మత్తు పదార్థాలకు కామన్ కోడ్‌గా “స్కోర్” అనే పదాన్ని వాడుతున్నట్లు విచారణలో తేలింది.
“మామ స్కోర్ చేసావా?” అంటూ ఆర్డర్ ఇచ్చి డ్రగ్స్ లావాదేవీలు నిర్వహించేవాడని అధికారులు తెలిపారు. లోతైన దర్యాప్తులో నిందితుడి తో సంబంధాలు కలిగి ఉన్న యువతులు, డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర సభ్యులపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని NCB–HNEW అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో ఉన్న సంబంధాలపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.