న్యూ ఇయర్ వేళ జపాన్‌ను కుదిపేసిన భూకంపం
posted on Jan 1, 2026 10:39PM

కొత్త సంవత్సరం ప్రారంభ వేళ జపాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. జపాన్ తూర్పు నోడా తీర ప్రాంతంలో బుధవారం (డిసెంబర్ 31) భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6గా నమోదైంది. కొత్త సంవత్సర వేడుకలకు జపాన్ ముస్తాబవుతున్న వేళ భూమి కంపించడంతో జనం భయంతో వణికిపోయారు.
నోడా నగరానికి తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర మట్టానికి 19.3 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. అయితే గత కొన్ని వారాలుగా జపాన్ లో తరచూ భూమి కంపిస్తున్నది. డిసెంబర్ 8న జపాన్ ను రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో సంభవించిన భూకపంపం అతలా కుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం కారణంగా దాదాపు 90 వేల మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.