ఢిల్లీలో భూకంపం

దేశ రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలలోనూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప కేంద్రం ఢిల్లీలో భూమి అడుగుల 5 కిలోమీటర్ల లోతులో  ఉందని సిస్మాలజీ అధికారులు తెలిపారు.  

సోమవారం తెల్లవారు జామున ఒక్కసారిగా భూమి కంపించింది. ఢిల్లీ తో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలోనూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.   ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu