ఏపీలో హైకోర్టు కోసం పోటా పోటీ ఉద్యమాలు
posted on Sep 24, 2019 3:23PM

ఏపీలో హై కోర్టు ను అమరావతి నుండి రాయలసీమ కు తరలిస్తారని వార్తలు వస్తున్న నేపధ్యం లో న్యాయవాదులు పోటా పోటీగా ఉద్యమాలు చేస్తున్నారు. హైకోర్టును అమరావతి నుండి తరలించవద్దని గుంటూరు జిల్లా తో పాటు మరో ఐదు జిల్లాల న్యాయవాదులు అమరావతిలో నిరసన బాట పట్టారు. ఎటువంటి పరిస్థితులలోను హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే రాయలసీమలో అక్కడి న్యాయవాదులు కూడా ఇదే విషయమై ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రం కోసం రాజధానిని త్యాగం చేశామని కనీసం ఇప్పుడైనా రాయలసీమలో హై కోర్టు ను ఏర్పాటు చేయాలని రాయలసీమ న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. ఏపీలో అన్ని విధాలా నష్ట పోయిన కర్నూల్ జిల్లాలో ఎపి హైకోర్టును ఏర్పాటు చేయాలని సీమ న్యాయవాదులు పట్టు పడుతున్నారు. మరి జగన్ ప్రభుత్వం ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి.