టీటీడీకి విరాళాలు

తిరుమల తిరుపతి దేవస్థానంకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణదానం ట్రస్ట్ కు మంగళగిరికి చెందిన మన్యం శ్రీనివాసరావు దంపతులు 20 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి ఈ విరాళం అంద చేశారు. తమ కుమార్తె మన్యం హరిత పేరున ఎస్వీ ప్రాణదాణ ట్రస్ట్ కు 10లక్షల 116 రూపాయలు, మరో కుమార్తె  మన్యం హారిక పేరు పై ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 10,00,116లు విరాళంగా అందజేశారు.  విరాళాన్ని అంద చేశారు. టీటీడీ బోర్డు సభ్యురాలు జానకీ దేవి సమక్షంలో ఈ విరాళం అందజేశారు. అన్నదాన, ప్రాణదాన ట్రస్ట్ లకు  విరాళం అందజేసిన దాతలను టీటీటీ చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు.

ఇలా ఉండగా బెంగళూరుకు చెందిన  టివోల్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తిరుమల శ్రీవారికి విద్యుత్ వాహనాన్ని విరాళంగా అందజేసింది. సోమవారం (సెప్టెంబర్ 15) మొంట్రా ఎలక్ట్రిక్ ఏవియేటర్ వాహనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం  అధికారులకు కంపెనీ ప్రతినిధులు అందజేశారు.  15 లక్షల 94 వేల 962 రూపాయల విలువైన ఈ వాహనానికి సోమవారం శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు వాహనం తాళాలను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో  లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు   భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu