మహారాష్ట్ర 27వ సీఎంగా ఫడణవీస్

 

మహారాష్ట్ర 27వ ముఖ్యమంత్రిగా భారతీయ జనతాపార్టీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలో ప్రజలతో క్రిక్కిరిసిన వాంఖడే స్టేడియంలో ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు ఫడణవీస్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఫడణవీస్ మరాఠీ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కె అద్వానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శివసేన నేత ఉద్ధవ్, పలువురు కేంద్ర మంత్రులు, ముఖేష్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్, అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu