కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకారం : ట్రంప్
posted on May 10, 2025 5:58PM

భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాలతో చర్చలు జరిపినట్లు.. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ పోస్ట్ చేశారు. రెండు దేశాలు కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ వాడాయంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే భారత్, పాక్ మధ్య మొదలైన దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో వెనక్కి తగ్గాలని ఇరుదేశాల్నీ వరుసగా విజ్ఞప్తులు చేస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్టులో ఇరు దేశాల మధ్య నిన్న రాత్రి నుంచీ తాము జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయని తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలకూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.