అంత్యక్రియలు జరిగాక.. వారానికి తిరిగి వచ్చి .. 

అసలు ఈ కాలంలో ఏం జరుగుతుందో అర్థం అవ్వడం లేదు. ఈ మధ్య చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సీన్లు సినిమాలోనే జరుగుతాయి అనుకుంటాం కానీ ప్రత్యేకంగా చూస్తున్నాం. అదేంటంటే అంత్యక్రీయలు జరిగాక తిరిగివచ్చిన వ్యక్తి. అని.. పడే మీద ఉన్న వ్యక్తి లేచికూర్చున్నాడని. ఇలాంటి వార్తలు చాలా వింటూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి మరో మరొకటి ఉంది. ఏం జరిగిందో మీరే తెలుసుకోండి..  

ఒక వ్యక్తి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడ.. ఒక చోటుకి చేరిన తర్వాత అతనికి ఆరోగ్యం మందగించింది. అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చేరాడు.  అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవర్ధన్ ప్రజాపత్ పరిస్థితి విషమించడంతో మరణించాడు. మూడు రోజులైనా గోవర్ధన్ శవాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అతని కుటుంబ సభ్యులు వచ్చారు అతని తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులంతా కన్నీరు కార్చారు.  చివరికి అతనికి హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రీయలు జరిపించారు. అంత్యక్రియలు జరిగిన వారం రోజుల తర్వాత ఓ వ్యక్తి సజీవంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు షాకైయ్యారు. 

గోవర్ధన్ పొటోలను సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల్లో ప్రచురించిన పోలీసులు గుర్తిస్తే సమాచారం అందించాలని కోరారు. ఇవి చూసిన ఓంకార్‌లాల్ కుటుంబ సభ్యులు మార్చురీకి వెళ్లి శవాన్ని చూసి ఓంకార్‌గా పొరబడ్డారు. ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియులు నిర్వహించారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఓంకార్‌లాల్ ఇంటికొచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. జరిగిన విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చనిపోయాడనుకున్న కొడుకు ఇంటికి రావడంతో సంతోషంలో  మునిగిపోయారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లాలో జరిగింది. అతని పేరు ఓంకార్‌లాల్  అతనికి 40  సంవత్సరాలు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu