గుంటూరు లో రేపు పూర్తి కర్ఫ్యూ

గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నేడు గుంటూరులో 14 కొత్త కేసులు నమోదు అయ్యాయి అని, గుంటూరులో మొత్తం 71 కేసులు నమోదు కాగా, గుంటూరులో 12 రెడ్ జోన్ ప్రాంతాలుగా గుర్తించామాన్నారు.
144 సెక్షన్ అమలులో ఉందన్నారు.
నిత్యావసర సరుకుల కొనుగోలు సమయం ఉదయం 6గంటల నుండి 9గంటల వరకు మాత్రమేనన్నారు.
బయటకు వచ్చే సమయంలో మాస్క్ లేకుంటే 1000 ఫైన్.
పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రేపు ఫుల్ కర్ఫ్యూ.
మెడికల్ తప్ప... ఏ షాప్ మార్కెట్స్ వుండవన్నారు.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోజు మార్చి రోజు మాత్రమే ప్రజలు బయటకు అనుమతి ఇచ్చామన్నారు.
ప్రజలు హోం డెల్వరీ సద్వినియోగం చేసుకోవాలి.
వారానికి సరి పడ సరుకులు కొనుక్కోవాలన్నరు.
లాక్ డౌన్ వలన మాత్రమే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యమాన్నారు.
కరోనా వైరస్ లక్షణాలు ఉంటే 104 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలన్నారు.
350 కేసులు శాంపిల్ ఉన్నాయి.క్వారెంటైన్ లో ఉన్న వారికి 500 రూపాయలు ఇస్తున్నామన్నారు.
ఢిల్లీ కాంటాక్ట్స్ వలనే కేసులు నమోదు.యువకుల్లో వారి శక్తి కొలది ఆలస్యంగా వైరస్ బయట పడుతుంది. ఇంట్లో ఉన్న పెద్ద వారు కోసం అయిన మాస్క్ ధరించాలి, దూరం పాటించాలన్నారు.
ఏ ప్రార్థనలు మీటింగ్స్ అనుమతి లేదు నిర్వహించిన పక్షంలో అట్టి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అర్బన్ ఎస్సీ రామకృష్ణ మాట్లాడుతూ కరోనా వైరస్ పాజిటివ్ చాలా వేగంగా పెరుగుతుంది.
రెడ్ జోన్ ప్రజలు కూడా బయట తిరుగుతున్నారు.
రెడ్ జోన్ ప్రజల కోసం నిత్యావసర సరుకులను అందుబాటులోకి తెచ్చాము...
వాకింగ్ కోసం కొంత మంది బయటకు వస్తున్నారు.వారికి బయటకు రాకుండా సూచనలు చేస్తున్నామ న్నారు.
రూరల్ ఎస్పీ విజయ రావు మాట్లాడుతూ నరసరావుపేటలో  కేబుల్ కలెక్షన్ అతనికి కరోనా పాజిటివ్ అని తెలింది.ప్రజలు అందరు కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు సహకరించాలని ఆయన కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu