కల్లు కి వెసులుబాటు క‌ల్పించండి! ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కరోనా విషయంలో మనం మిగితా దేశాలతో పోలిస్తే మన దేశం మన రాష్ట్ర బెటర్ అండ్ సేఫ్ గా ఉందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెబుతున్నారు. గ్రామీణా ప్రాంతాలు దేవునిదయ వల్ల అంత బనే ఉంది. పట్టణాల్లోనే అక్కడ అక్కడ కరోనా సంఘటనలు కనిపిస్తున్నాయ‌ట‌. 

అయితే లాక్‌డౌన్ దెబ్బ‌తో వేరే జ‌బ్బుతో తెలంగాణా గ్రామీణ ప్ర‌జ‌లు కొంత మంది బాధ‌ప‌డుతున్న‌ర‌ని జ‌గ్గారెడ్డి అంటున్నారు. అదే గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు కల్లు  తాగడం అలవాటు. కల్లు  ప్రస్తుతానికి లేకపోవడం వల్ల ఒక సెక్షన్ ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారట‌. అంతే కాదు హాస్పిటల్ చేరుతున్నారు. ఈ జ‌బ్బుకు మెడిసిన్ లేదు. ఇలాంటి వారికీ  కల్లే  మెడిసిన్ అని ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఓ డాక్ట‌ర్‌లా అలాంటి రోగుల‌కు మెడిసిన్‌గా క‌ల్లు ప‌నిచేస్తుంద‌ని చెబుతున్నారు. 

కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో  కల్లు కి వెసులుబాటు ఇచ్చే అంశం పై ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఏమైనా ఉందా అని ప్ర‌భుత్వానికి ప్ర‌శ్నిస్తున్నారు?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu