సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్.. ఎస్సై భానుప్రకాష్ పై క్రిమినల్ కేసు

హైదరాబాద్ పోలీసు శాఖలో తీవ్ర సంచలనం సృష్టించిన ఎస్సై భాను ప్రకాష్ వ్యవహారంలో పోలీసు శాఖ  సీరియస్ యాక్షన్ కు దిగింది. భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ కేసులో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. భాను ప్రకాష్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచేశాయి. భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ మే నెల నుంచే మిస్సైందని తేలింది. అంతే కాకుండా భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ చోరీకి గురి కాలేదనీ, స్వయంగా భాను ప్రకాషే తన గన్ ను దొంగతనంగా బయటకు తీసుకువెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో రూఢీ అయ్యింది.  

స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు   భాను ప్రకాష్ గన్ తీసుకువెళ్లడం సీసీ కెమేరాల్లో రికార్డు కాకుండా ఉండేందుకు  కెమెరాకు అడ్డుగా టేబుల్‌ను పెట్టి, ఆ తర్వాత గన్‌ను తన పాకెట్‌ లో పెట్టుకుని బయటకు వెళ్లినట్టు  పోలీసులు గుర్తించారు. అతడు గన్ ను తీసుకువెళ్లిన రోజు నుంచే అది మిస్సైందని గుర్తించారు. ఇక పోతే భాను ప్రకాష్ ఆర్థిక అరాచకత్వంపై కూడా పోలీసులు కూపీ లాగారు.  భాను ప్రకాష్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కోటి రూపాయల వరకు నష్టపోయినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ నష్టాల కారణంగానే సర్వీస్ గన్‌ను విక్రయించినట్టు పోలీసులు అనుమాని స్తున్నారు.   ఈ కేసులో మరెవరిదైనా ప్రమేయం ఉందా?, గన్ ఎవరికి అమ్మాడు? అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu