క్రికెటర్ కు తప్పిన ప్రమాదం..
posted on Jul 18, 2016 5:12PM

టీమిండియా క్రికెటర్, కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ కు ప్రమాదం తృటిలో తప్పింది. కరుణ్ నాయర్ నిన్న పంపానదిలో స్నేక్ బోట్ లో ప్రయాణిస్తుండగా.. ప్రమాదవశాత్తు పడిపోయింది. సుమారు 100 మంది ప్రయాణికులతో ఉన్న పడవ తల్లగిందులై పడిపోగా అందులో ఉన్న వారందరూ నదిలో పడిపోయారు. అయితే అదృష్టవశాత్తు..ప్రయాణిస్తున్న పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వారిలో ఇద్దరు మాత్రం గల్లంతైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శ్రీ పార్థసారథి స్వామి వారి ఆలయంలో జరిగే వాల్లా సద్యా ఉత్సవానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే అక్కడి రెస్యూ సిబ్బంది తక్షణం స్పందించడంతో ఇద్దరు మినహా మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారని ఆర్నామూలా పోలీసులు తెలిపారు.