శ్రీవారి దగ్గరా ఆధార్ కావాల్సిందే..

ఏ పథకం కింద ప్రయోజనాలు పొందాలన్నా..చివరికి సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డ్ కావాల్సిందే. తాజాగా కోట్లాది మంది ఇలవేల్పు తిరుమల శ్రీవారి దేవాలయంలోనూ ఆధార్ తప్పనిసరి కానుంది. స్వామి వారి సన్నిధిలో అంగ ప్రదక్షిణ పొందాలనుకునే భక్తులు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని జేఏవో శ్రీనివాసరాజు కోరారు. వచ్చే గురువారం నుంచి ఈ నిబంధనను అమల్లోకి తేనున్నట్టు ఆయన చెప్పారు. దీంతో పాటు శ్రీవారి కానుకల లెక్కింపునకు కొత్త కాంప్లెక్స్ నిర్మించనున్నట్టు వివరించారు. స్వచ్చ భారత్‌లో భాగంగా తిరుమలలో వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించనున్నట్టు వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu