అమ్మాయిలతో ఎమ్మెల్యే చిందులు..
posted on Jul 18, 2016 4:49PM

ఈ మధ్య జేడీయూ ఎమ్మెల్యేలు పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే అసెంబ్లీకి తాగి వచ్చిన నేపథ్యంలో జేడీయూకు చెందిన నేత సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నాడు. బీహార్లో జేడీయూ ఎమ్మెల్యే శ్యాం బహదూర్ సింగ్ డ్యాన్సింగ్ గర్స్త్ తో డ్యాన్స్ చేస్తూ బుక్కయ్యాడు. అది కూడా అభ్యంతరకరమైన పరిస్థితుల్లో. అయితే ఈ ఘటన గత ఏడాది చోటుచేసుకోగా.. ఇప్పుడు ఆవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా తిరునాళ్లలో, జాతరల్లో నిర్వహించే అభ్యంతరకర నృత్యాలు దాదాపుగా బ్యాన్ అయిన విషయం తెలిసిందే. అలాంటిది వాటిని ఖండించాల్సిన నేతనే ఇలాంటి పనలు చేస్తున్నారంటూ అందరూ తిట్టి పోస్తున్నారు. మరి సదరు ఎమ్మెల్యే గారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.