ఫోర్జరీ కేసులో మాజీ మంత్రి కాకాణికి రిమాండ్

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ నెల్లూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూముల కబ్జాకు వెంకటాచలం తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కాకాణిపై నమోదైన కేసుకు సంబంధించి నెల్లూరు అడిషన్ మేజిస్టేట్ కోర్టు ఈ ఉత్తర్వలు జారీ చేసింది.

ఇప్పటికే మరో కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని ఫోర్జరీ చేసులో వర్చువల్ గా గురువారం (జులై 24) నెల్లూరు కోర్టులో హాజరు పరిచారు.  ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేకుండానే కాకాణిని 14వ నిందితుడిగా చేర్చారని ఆయన తరపు లాయర్లు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణిని 14 రోజుల పాటు అంటే ఆగస్టు 7 వరకూ జ్యూడీషియల్ రిమాండ్ కు ఆదేశించింది. ఇళఆ ఉండగా కాకాణికి బెయిలు ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu