అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

తన డ్రైవర్ ను మర్డర్ చేసి మృతదేహాన్ని సొంత కారులో డోర్ డెలివరీ చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్న అనంతబాబు గడువులోపల తనపై చార్జిషీటు దాఖలు చేయనందున బెయిలు ఇవ్వాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్ ను రాజమహేంద్రవరం ఎస్సీఎస్టీ న్యాయస్థానం కొట్టివేసింది. ఆయన బెయిలు పిటిషన్ ను  కోర్టు తిరస్కరించడం ఇది రెండో సారి.

తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనంతబాబుకు కోర్టు మూడు రోజులు కండీషన్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన బెయిలు పొడిగించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఈ నెల 5 వరకూ బెయిలు పొడిగించింది.

అయితే కింది కోర్టు బెయిలు షరతులపై ఇచ్చిన ఉత్తర్వులు యథాతథంగా అమలులో ఉంటాయని స్పష్టం  చేసింది.  మరో నాలుగు రోజులలో హైకోర్టు పొడిగించిన బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో అనంతబాబు మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టులో చుక్కెదురైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu